ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ పట్టణం లో ఘనంగా గణేష్ నిమజ్జనం

By on Sep 23, 2018 in World Culture

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ పట్టణం లో ఘనంగా గణేష్ నిమజ్జనం

మెల్బోర్న్ లో నివసిస్తున్న ప్రవాస భారతియు మరియు కరీంనగర్ ఏబీవీపీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగాయి .

పదకొండు రోజులుగా పూజలు అందుకున్న గణేష్ నిమజ్జనానికి దాదాపు 100 పైగా అక్కడ విద్యను అభాసిస్తున్న విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.గణపతి బొప్ప మొరియా అంటూ గణనాథుని గంగమ్మ ఒడికి భారీ ఊరేగింపుగా సాగారు.అంతకు ముందు నిర్వాహకులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందువులంతా బంధువులుగా మెలగాలని , హిందు ధర్మ రక్షణకు హిందువులంతా కట్టుబడి ఉండాలని వారు గణపతిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వడ్లకొండ రాజ్ కుమార్ , అదిత్య శర్మ ,సాయి కిరణ్, వల్స మహేష్,రామకృష్ణ , దివ్య,ఐశ్వర్య రెడ్డి, ఉదయ్,ధనరాజ్, అజయ్,అభినవ్,కార్తీక్,రాజేష్,హరికృష్ణ,భార్గవ్,ప్రేమ్, దుర్గ ప్రసాద్,ఈశ్వర్,వర్మ,సునీల్ కృష్ణ,శ్రీ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

<
>

 

(courtesy: Batthini Vinay Kumar Goud)