భాషా సాంస్కృతిక శాఖ: ఈరోజు 19 జూలై 2018 (గురువారం)న ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ లో సాయంత్రం 6:00 గంటలకు “ది సీక్రెట్ ఆఫ్ ది గ్రేయిన్” సినిమా ప్రదర్శన. పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతిలో…

ఈరోజు 19 జూలై 2018 (గురువారం)న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ఫంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ (ఫ్రెంచ్) ఫెస్టివల్ లో సాయంత్రం 6:00 గంటలకు “ది సీక్రెట్ ఆఫ్ ది గ్రేయిన్” సినిమా ప్రదర్శన. పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతిలో…

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిస్ 2007లో విడుదలైన ఫ్రాంకో – ట్యునీషియన్ చిత్రం. అబ్దెల్ల తీఫ్ కేచీచే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హబీబ్ బుఫారెస్ వలదారుని పాత్రలో నటించారు. విడాకులు తీసుకుని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న 60 ఏళ్ల హబీబ్, ఒంటరి జీవితం నుంచి ఉపశమనం పొందడం కోసం సొంతంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనుకుంటాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించిన హబీబ్ కుటుంబ సభ్యులను కలిసి వారి మద్దతుతో తన కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. 2008 సీజర్ అవార్డులలో ఉత్తమ ఫ్రెంచ్ సినిమా, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, మోస్ట్ ప్రోమిసింగ్ యాక్ట్రస్ విభాగాల్లో బహుమతులను అందుకుంది.

(courtesy: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ)