మేడారం జాతర: రానున్న మూడు రోజులు కీలకమైనవి, అధికారులు అప్రమతంగా ఉండాలి – కలెక్టర్ ఆర్వీ కర్ణన్

👉 జాతరలో రానున్న మూడు రోజులు కీలకం

👉 అధికారులు అప్రమత్తంగా ఉండాలి

👉భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు

👉 విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు

👉 అధికారులు సమన్వయం తో పని చేయాలి

👉 సేవ చేసే గొప్ప అవకాశం ను సద్వినియోగం చేసుకోండి

👉 జాతరలో పారిశుధ్య కార్మికుల పాత్ర వేల లేనిది

👉జాతర చివరి రోజున వారికి ప్రత్యేక దర్శనం

👉 సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నోడల్ అధికారి వీపి గౌతమ్, ఓఎస్డి కృష్ణ ఆదిత్య

మీడియా సెంటర్, మేడారం, 4-2-2020: మేడారం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. రానున్న మూడు రోజులు  కీలకమైనవి. అధికారులు అప్రమతంగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.  ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇక ముందు నిర్వహించే విధులు అత్యంత కీలకమైనవిగా పేర్కొన్నారు. నేడు ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో  దేవతలకు సేవ చెసే గొప్ప అవకాశం లభించిందని ఇది సేవ గా భావించి సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు కేటాయించిన విధులు బాగా చేశారని ఇక ముందు కొనసాగించాలని తెలిపారు. విధుల పట్ల అలసత్వం వహించిన అధికారులు సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దేవతలను దర్శనం చేసుకునేలా కృషి చేయాలన్నారు.

వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అవసరమైతే మరిన్ని ట్రాక్టర్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విదంగా తల్లులు గద్దెల మీద ఉన్నా 5,6,7,8 వ తేదీలలో ప్రాంగణంలో బెల్లం ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ శుభ్రంగా ఉంచాలని డిపిఓ, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య కార్మికుల సేవ మహోన్నతమైనదని వారికి చివరి రోజున ప్రత్యేక దర్శనం కలిపిస్తామని కలెక్టర్ ప్రకటించారు.  వారికి భోజనాలు , వసతి, చెల్లింపులు సక్రమంగా ఉండేలని ఆయన చెప్పారు.

ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేప్పట్టిన పూర్తి అయిన ఐదు షెడ్లని గిరిజన శాఖకు అప్పగించాలని వాటిలో ఒకటి ఎన్ ఎస్ ఎస్ వాలింటీర్లకు అదేవిదంగా ఒకటి ఆది వాసి పూజరులకు మిగిలిన మూడు సాధారణ భక్తులకు కేటాయించాలని పీఓ ఐటీడిఏ చక్రధర్ రావు కు సూచించారు. 

జాతరలో అక్రమ గుడుంబా ను అరికట్టాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అదే విదంగా జాతర విధులకు హాజరైన 475 ఎక్సైజ్ అధికారులలో 40 మందిని ఆహార భద్రత శాఖకు అలాగే మరో 40 మందిని అటవీ శాఖ అధికారులకు కేటాయించి సమన్వయం తో పని చేయాలన్నారు.  ఎక్సైజ్ అధికారులతో కలిసి ఆరు బృందాలుగా ఏర్పడి రెండు షిఫ్టులగా ఏర్పడి తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఆహారానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

జంపన్న వాగు వద్ద 24 గంటలు నీరు రావాలని ఎక్కడ నీటి సమస్య తలెత్తిన సంబంధిత అధికారుల పై చర్యలు వుంటాయని తెలిపారు.

నోడల్ అధికారి వీపి గౌతమ్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి  సెక్టార్ సింగిల్ నోడల్ పాయింట్ అని అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని తెలిపారు. అన్ని సెక్టార్లలో కచ్చితంగా ఒక వైద్య శాఖ సిబ్బంది ఉండాలని డియంహెచ్ఓ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  ఓఎస్డి కృష్ణ ఆదిత్య ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు కొండిబా జెడ్ , ఆదర్శ సురభి ,శ్రీ హర్ష జిల్లా పరిషత్ సీఈవో పారిజాతం , జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్య. ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామచంద్రనాయక్ జిల్లా పంచాయతీ అధికారి కె వెంకయ్య జిల్లా ఫైర్ అధికారి భగవాన్ రెడ్డి తదితరులు పాలుగొన్నారు.