రాజ్‌భవన్‌లోఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

By on Sep 8, 2019 in Other Venues

తేది. 08-09-2019: కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆరుగురు నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. హరీశ్‌రావు, కె.తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.