Kalavaibhavam.com (31.08.19): అబ్బురపరిచిన తెలంగాణ ” జానపద జాతర 2019 “

By on Aug 31, 2019 in Ravindra Bharathi

అబ్బురపరిచిన తెలంగాణ ” జానపద జాతర 2019 “

జానపద ఉత్సవాల సందర్బంగా ” జానపద జాతర 2019 ” జానపద ప్రదర్శనలతో పులకించిన రవీంద్రభారతి ప్రాంగణం. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో ” జానపద జాతర 2019 ” ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది సాంప్రదాయ కళాకారులు విభిన్న వేషధారణలతో జానపద ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ అధ్యక్షుడు బి.ఎస్. రాములు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, జానపద కళాకారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

     

 

(Photos Courtesy: Mamidi Harikrishna)