Kalavaibhavam.com (5-Feb:) మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష

మేడారంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తేలిపారు. పిలుపునిచ్చారు. మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి తల్లుల దర్శనం సజావుగా జరగి వారు మంచి జ్ఞాపకాలతో  మేడారం నుండి తిరిగి వెళ్లేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నేడు ఆయన డిజిపి మహేందర్ రెడ్డి తో కలిస హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి మేడారం వచ్చారు.  అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనులు, కలిపించిన సౌకర్యాలు , కేటాయించిన విధుల పై  మేడారం ఆలయ ఆవరణలో జిల్లా యంత్రాంగం తో సమీక్షించారు.. అంతకు ముందు ఆయన హెలిప్యాడ్ వద్ద నుండి జంపన్న వాగు నుండి  ఏర్పాట్లను పరిశీలిస్తూ గద్దెల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రెటరీ  మాట్లాడుతూ రానున్న మూడు రోజులు కీలకం అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన సెక్టార్లలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. అదే విదంగా మరుగుదొడ్లు నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. చెత్త ను సేకరించి డంపింగ్ యార్డులకు  రహదారుల పై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతర పరిసరాలు 100% పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జంపన్నవాగు వద్ద నీటి ఫ్లో ను మెయిన్ టైన్ చేయాలని ఇర్రిగేషన్ శాఖకు అదే విదంగా నీటి వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. నిరంతర విద్యుత్ అందించాలని,  అక్రమ మద్యం రవాణా, కల్తీ మద్యం ను అరికట్టాలని ఆయా శాఖలను ఆదేశించారు.  శాంతి భద్రతలు పరిరక్షించి భక్తులకు భద్రత, సేఫ్ దర్శనం చేసుకునేలా పోలీస్ యంత్రంగం కృషి చేయాలన్నారు. ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రోజు జాతర ఏర్పాట్లు , భక్తుల ఫ్లో పై సమీక్షిస్తున్నారన్నారు. జాతర ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు రోజు మేడారం వచ్చి  క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్ర  ముఖ్యమంత్రి  హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ను కేటాయించారని తద్వారా ముఖ్యమంత్రి జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. జాతర విజయవంతానికి వేసిన ప్రణాలికను అమలుపర్చాలన్నారు. అధికారుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.పారదర్శకంగా, బాధ్యతాహితంగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. జాతరలో అన్ని పనులు నిర్ణిత గడువు లోగా పుర్తి చేశారని కలిపించిన సౌకర్యాలు భక్తులు వినియోగించునుకునెల చూడాలన్నారు.
 సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

డీజిపి  మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ లో నిష్ణాతులైన ట్రాఫిక్ పోలీస్ అధికారులను మేడారం జాతరలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నియామించి పక్కా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించి అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు డి ఐ జి ర్యాంక్ అధికారులు, 6 ఎస్పి లు, 12 వేల పోలీస్ యంత్రాంగంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా షి టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలను పార్కింగ్ స్ధలాల్లోనే నిలపేల చసుకోవాలన్నారు. జాతర వ్యాప్తంగా  సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ జరుగుతోందన్నారు. తొక్కిసలాట జరగకుండా నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని పోలిస్ అధికారులను ఆదేశించారు.  భక్తులకు ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయించమన్నారు. అందరి సహాయ సహకరాలతో జాతరను విజయవంతం చేద్దాం అని డిజిపి పిలుపునిచ్చారు.

కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ  జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రద్దీ క్రమబద్ధీకరణకు అవసరమైన బారికేడింగ్ చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమ్మక్కను చిలుకలగుట్ట నుండి గద్దెల మీదకు తీసుకువచ్చేందుకు ఎస్పీ తో కలిసి ట్రయిల్ రన్ చేశామని, అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు.

ఎస్పీ మాట్లాడుతూ  ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నామని అక్కడ ఫ్లడ్ లైట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జంపన్నవాగు లో రోపులు ఏర్పాటు చేశామని భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు.


ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వీపి గౌతమ్,  ఓఎస్డి కృష్ణ ఆదిత్య ఏటూర్ నాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు కొండిబా జెడ్ , చక్రధర్ రావు సంబంధిత అధికారులు పాలుగొన్నారు