Kalavaibhavam.com (30.07.19): ఆచార్య ఎస్.వి. రామారావుకు కిన్నెర – సినారె సాహితీ పురస్కారం

By on Jul 30, 2019 in Tyagaraya Ganasabha

ఆచార్య ఎస్.వి. రామారావుకు కిన్నెర – సినారె సాహితీ పురస్కారం

కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయగానసభలో డా. సి. నారాయణ రెడ్డి 88వ జయంతి సందర్భంగా కిన్నెర – సినారె సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, ఓయు తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు, డీన్ డా. ఎస్.వి రామారావుకు ప్రదానం చేసారు.

జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త డా. సి. నారాయణ రెడ్డి గొప్ప కావ్య గాన కర్త, పరిశోధకులు, స్ఫూర్తిదాత, కారణ జన్ముడని ముఖ్య రమణాచారి కీర్తించారు.

సినారె ప్రియశిష్యుడిగా, సాహితీ రంగంలో విమర్శకుడిగా తనదైన ప్రతిభను చాటుతున్న ఆచార్య ఎస్.వి. రామారావుకు ఆ మహనీయుడి పేరిట నెలకొల్పిన సినారె సాహితీ పురస్కారం బహుకరించడం అభినందనీయమని, సాహితీ రంగంలో ఎస్.వి. రామారావు ఎంతో కృషికి చేసారని వక్తలు కొనియాడారు.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సినారె-ఘంటసాల సినీ సంగీత విభావరిని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ఆచార్య ఎన్. గోపి, న్యాయవాది ఎం. శివానంద కుమార్, శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి రాజేంద్రప్రసాద్, కిన్నెర రఘురాం, ఎ.ఎస్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.