Kalavaibhavam.com (29.09.19): ప్రకృతికి నివేదన ఉత్సవమే బతుకమ్మ పండుగ: సంచాలకులు మామిడి హరికృష్ణ

ప్రకృతికి నివేదన ఉత్సవమే బతుకమ్మ పండుగ: సంచాలకులు మామిడి హరికృష్ణ

అందరూ బాగుండాలనే ఉద్ధేశ్యంతో 9రోజులపాటు ప్రకృతికి నివేదన చేయడమే బతుకమ్మ పండుగ అని, అమ్మ అనే పదం తరువాత బతుకమ్మ అనే పదంలో అంతటి అనుభూతి భావోద్వేగం ఉందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘హవా’ చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చిత్ర దర్శకుడు మహేష్ రెడ్డి, నటుడు చైతన్య, సినిమాటోగ్రాఫర్ సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్, గీత రచయిత్రి లక్ష్మి ప్రియాంక విచ్చేసి ప్రేక్షకులతో చిత్ర అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి చిత్రబృందాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా, మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… సినిమాలను చూడడం, ప్రశంసించడం కూడా ఒక కళ అని నమ్ముతూ గత 5ఏళ్ళుగా రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా అనేక సినీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిఏటా బతుకమ్మ ఫిల్మోత్సవంలో అయా సంవత్సరం విడుదలైన కొత్త సినిమాలను ప్రదర్శన చేస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రదర్శన జరుపుకున్న ‘హవా’ సినిమా కథను నమ్ముకొని తీశారని, పూర్తిస్థాయిలో ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమని, తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా యంగ్ ఫిలింమేకర్స్ కు చేరాలన్న ఉద్ధేశ్యంతో బతుకమ్మ ఫిల్మోత్సవంలో ప్రదర్శించామని పేర్కొంటూ అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు అందజేశారు.

చిత్ర యూనిట్ మాట్లాడుతూ… కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమాకు ఇంతమంచి స్పందన రావడం మా అదృష్టమని, ఇదే ఇన్స్పిరేషన్ తో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని పేర్కొంటూ చిత్ర నిర్మాణానికి సహకరించిన నిర్మాతలకు, ఇంతమంచి వేదికలో సినిమాను ప్రదర్శించి ప్రోత్సహించిన సంచాలకులు మామిడి హరికృష్ణకి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *