ISO సర్టిఫికెట్ సాదించిన యాధాద్రి పుణ్యక్షేత్రం – సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. 21-07-2018

By on Jul 21, 2018 in Yadadri and Temples

ISO సర్టిఫికెట్ సాదించిన యాధాద్రి పుణ్యక్షేత్రం – యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ)కి, యాదాద్రి దేవస్థానానికి అరుదైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. పర్యావరణ పరిరక్షణ, భద్రత, ఆలయ నిర్వహణలొ సేవలకు గుర్తిపు – భారతాదేశంలో ఓ ఆలయానికి ISO సర్టిఫికెట్ ఇదే తొలిసారి – శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా వైటీడీఏ వైస్‌చైర్మన్ జీ కిషన్‌రావు, యాదాద్రి ఈవో గీత ఐఎస్వో సర్టిఫికెట్‌ను అం దుకొన్నారు.

యాదగిరిగుట్ట దేవాలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వైటీడీఏ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. వైటీడీఏ వైస్ చైర్మన్, సీఈవో కిషన్‌రావు, ఈవో ఎన్ గీత, హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఆలపాటి శివయ్య కేసీఆర్‌తో శనివారం సమావేశమయ్యారు. దేవాలయం డిజిటలైజేషన్, ఐఎస్వో గుర్తింపు గురించి వివరించారు. 

ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

<
>