Feb-7: జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

By on Feb 7, 2020 in Other Venues

జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ (కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో 69 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా నిలిచింది.