Feb-6: మేడారం జాతరలో మీడియా సెంటర్ ను సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  గురువారం సాయంత్రం మేడారం జాతరలో మీడియా సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు.

మీడియా సెంటర్లో సమాచార శాఖ ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకొని ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా మేడారం జాతర లో ప్రభుత్వం ద్వారా భక్తులకు అందిస్తున్న సేవల గురించి పాత్రికేయులతో అడిగి తెలిసికొని, గతంతో పోల్చుకొంటే ఈసారి భక్తులకు అసౌకర్యం కలుగకుండ సౌకర్యాలు కల్పించారని తెలుసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు   భక్తులకు అందించుటకు చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమములో  సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్.జగన్, డిపిఆర్ ఓ యం..ఏ.గౌస్, తదితరులు పాల్గొన్నారు.