Kalavaibhavam.com (02.10.19): మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ” గాంధీ వాదం విపంచి నాదం ” పేరుతో 125 మంది తెలంగాణ సంగీత కళాశాలలకు చెందిన వీణా వాయిద్య కళాకారుల ప్రదర్శన – అతిధిగా పాల్గొన్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

మహాత్మా గాంధీ 150 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ వాదం విపంచి నాదం పేరుతో 125 మంది తెలంగాణ సంగీత కళాశాలలకు చెందిన వీణా వాయిద్య కళాకారుల తో ఏర్పాటు చేసిన కార్యక్రమములో రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అథిదిగా పాల్గోన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాందీ 150 వ జయంతి, బతుకమ్మ సంబురాలను కలపి విన్నూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 125 మంది వీణా వాయిద్య కళాకారులు ఒకే వేదిక పై ప్రదర్శన చేయటం అద్భుతంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మ మన తెలంగాణకు ప్రత్యేకం అన్నారు. వందల ఏళ్ళు గా మన తెలంగాణ సంస్కృతి లో భాగంగా నిలిచిందన్నారు. సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ ను కనుమరుగుచేసే కుట్రలు జరిగిన జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మ పండక కు పూర్వ వైభవాన్ని తీసుకవచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ప్రాచీన కళలు, సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గాను ప్రోత్సహిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
అందులో భాగంగా బతుకమ్మ సంబురాలను రాష్ట్రంలో నే కాకుండా విశ్వ వ్యాప్తంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. గాంధీ మహాత్ముడు కలలు కన్న అహింస మార్గంలో నేడు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలు మహిళల కోసం నిర్వహించే పండుగ బతుకమ్మ పండుగగా అభివర్ణించారు.

మహిళలు ఆదిపరాశక్తి గా మరాలన్నారు. ఆధునిక సమాజంలో మన సాంస్కృతి , సంప్రదాయాలను పిల్లలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత , నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ శివ కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు పాల్గొన్నారు

(Courtesy:fb.com/tsculturedirector)