Kalavaibhavam.com(12-Feb): ఈనెల (ఫిబ్రవరి) 20 న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఇవామ్ (IWAM) సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి సారథ్యంలో “ఆటకదరా శివ” సంగీత ప్రదర్శన – బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి వి. శ్రీనివాస్ రెడ్డి

By on Feb 12, 2020 in Other Venues

ఈనెల (ఫిబ్రవరి) 20 న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఇవామ్ (IWAM) సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి సారథ్యంలో “ఆటకదరా శివ” సంగీత ప్రదర్శన

బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి వి. శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలో లోని తన కార్యాలయంలో ప్రముఖ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారి సారధ్యంలో రూపొందించిన “ఆటకదరా శివ” ఒక భక్తి సింఫొనీ సంగీత కార్యక్రమం బ్రోచర్ ను ఆవిష్కరించారు.

మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఇవామ్ (IWAM) సాంస్కృతిక సంస్థ, తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అద్వర్యం లో ప్రముఖ కవి, నటులు, రచయిత, దర్శకులు, తనికెళ్ళ భరణి సారథ్యం లో ప్రముఖ వేణు వాద్య కళాకారుడు తాళ్లూరి నాగరాజు సంగీతం దర్శకత్వంలో శ్రీమతి మణి నాగరాజ్ చేపట్టిన కార్యక్రమం “ఆటగదరా శివా” ను ఈనెల (ఫిబ్రవరి) 20 న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుందన్నారు.

ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ‘ఆటగదరా శివ’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆధ్యాత్మిక పాఠకలోకానికి అందించారన్నారు. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుందన్నారు. ఈ పుస్తకంలోని అంశాలను ఒక కార్యక్రమం రూపంలో కూర్పు చేసి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారన్నారు. అమెరికా, దుబాయి లాంటి పలు దేశాలలో భారతీయ వాయిద్యాలతో ఆటగదరా శివను కచేరి తరహాలో ప్రదర్శించారని, ఇదే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నoదుకు సంతోషంగా ఉందన్నారు.

ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో ప్రఖ్యాత వేణు గాన విద్వంసుడు తాళ్లూరి నాగరాజు అద్వర్యం లో ఒక అంతర్జాతీయ స్థాయి సంగీత, కళాకారుల బృందంతో సింఫనీ తరహలో ప్రదర్శించేందుకు ఇప్పుడు రంగం సిద్ధమయింది. ఫ్లూట్ నాగరాజు, డ్రంస్ శివమణి తదితర ప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారన్నారు. పలు విదేశీ పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమానన్ని అజరామరంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.