Kalavaibhavam.com(7-Feb): కళావాహిని 30వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెల ఫిబ్రవరి 12 నుండి 14 వరకు శిల్పకళా వేదికలో తెలంగాణ కళా జాతర – పోస్టర్ ఆవిష్కరణ

By on Feb 7, 2020 in Other Venues

కళావాహిని 30వ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెల ఫిబ్రవరి 12 నుండి 14 వరకు శిల్పకళా వేదికలో తెలంగాణ కళా జాతర – పోస్టర్ ఆవిష్కరణ

కళావాహిని ఆధ్వర్యంలో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, సోచ్ మరియు బాస్ సంస్థలతో కలిసి ఈ నెల ఫిబ్రవరి 12 నుండి 14 వరకు శిల్పకళా వేదికలో ” తెలంగాణ కళా జాతర ” నిర్వహిస్తున్నట్లు కళావాహిని వ్యవస్థాపకులు ఆకుల రమేష్ రాజా తెలిపారు. కళావాహిని సాంస్కృతిక సంస్థ స్థాపించి 30 సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా, సంస్థ 30వ వార్షికోత్సవాలను 33 జిల్లాలకు చెందిన జానపద కళారూపాలను ” తెలంగాణ కళా జాతర ” లో ప్రదర్శించనున్నట్లు రమేష్ రాజా తెలిపారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ” తెలంగాణ కళా జాతర ” పోస్టర్లను కళావాహిని వ్యవస్థాపకులు ఆకుల రమేష్ రాజా, కన్వినర్ రమణ రాజు, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్, ఐ స్టాండ్ ఫర్ ది నేషన్, సోచ్ మరియు బాస్ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

గత సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ లోని పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో అనువులు బాసిన సైనికులకు నివాళులు ఇవ్వాలనే నినాదంతో 2020 ఫిబ్రవరి 14వ తేదీన వారి జ్ఞాపకార్థం ” ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ” సంస్థ అధ్యక్షులు ఇప్పలపల్లి రమేష్ ఆధ్వర్యంలో సైనిక వందనం చేస్తూ ప్రతి పౌరులు దేశభక్తిని చాటుకునే విధంగా అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసిన ” ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ” సహకారంతో తెలంగాణ కళా జాతర కార్యక్రమంలో ప్రేత్యేకంగా నిర్వహిస్తున్నారు.

గత ౩౦ సంవత్సరాల క్రితం అబ్బురపరిచే వైవిధ్యమైన, విభిన్నమైన సంస్కృతులను కళారూపాల ద్వారా భవిష్యత్తు తరాలకు అందించాలనే సత్ సంకల్పంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 12,13,14 తేదిలలో ” తెలంగాణ కళా జాతర ” కార్యక్రమానికి కళావాహిని సంస్థ శ్రీకారం చుట్టిందని తెలిపారు. అలాగే ఈ ప్రదర్శనల సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పురస్కారాల ద్వారా సత్కరించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఇప్పలపల్లి రమేష్ హరికృష్ణ, రాధాకృష్ణ, అనిల్, విజయ్ కుమార్, మురళీధర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.