Kalavaibhavam.com(12-Feb): కళావాహిని ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ కళా జాతర

By on Feb 12, 2020 in Arts and Culture, Other Venues

కళావాహిని ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ కళా జాతర

హైదరాబాద్ శిల్పకళావేదికలో తెలంగాణ కళా జాతర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర టూరిజం చైర్మన్ పి. భూపతి రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాష్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కళావాహిని 30వ వార్షికోత్సవం సందర్బంగా, కళావాహిని ఆధ్వర్యంలో తెలంగాణ భాష, సాంసృతిక శాఖ, పర్యాటక శాఖ సౌజన్యంతో, T-NEWS సహకారంతో నేటి నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 33 గంటల పాటు నిర్వహించే ఈ సాంస్కృతికోత్సవంలో 33 జిల్లాల నుండి కళారూపాల ప్రదర్శన, 33 విశిష్ట పురష్కారాల ప్రదానం ఈ కళాజాతరలో ప్రార్దన అంశాలు.

వివిధ జిల్లాల నుండి వచ్చిన కళాకారులు జానపద గీతాలు, నృత్యాలు, యోగాసనాలు, వివిధ కాళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించి పురస్కారాలను అందచేశారు.

కళావాహిని వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల రమేష్ రాజా, సలహాదారు ఎన్.వి. రమణ రాజు, కార్యక్రమం సమన్వయకర్త కాంచన పల్లి రాజేంద్ర బాబు, రవితేజ, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్, కళాబ్రహ్మ, శిరోమణి డా. వంశీ రామరాజు, మగ్దూం మొహియుద్దీన్, దైవాజ్ఞ శర్మ, మొగులయ్య (12 మోట్ల కిన్నెరా వాయిద్య కళాకారుడు) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.