Kalavaibhavam.com (04.08.19): ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య మరియు కథక్ నృత్యాలు ప్రదర్శనలు

By on Aug 4, 2019 in Shilparamam

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య మరియు కథక్ నృత్యాలు ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం ఆవరణలో భరతనాట్య మరియు కథక్ నృత్యాలు ఎంతగానో అలరించాయి.

కుమారి అంజు అరవింద్, భరతనాట్య ప్రదర్శనలో భాగంగా గణేష్ పంచరత్న, నవరస మోహన, అష్టపడి మరియు థిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

ప్రముఖ కథక్ నృత్య గురువులు సంజయ్ జోషి వారి శిష్యబృందంచే గణేశవందన, ద్రుపద్ – మహాకాళి అమ్మవారి కీర్తన, కస్తూరి తిలకం – శ్రీ కృష్ణ మరియు తరాణ అంశాలను ప్రదర్శించి మెప్పించారు.