Kalavaibhavam.com (04.10.19): భాషా సాంస్కృతిక శాఖ బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో ”నువ్వు తోపురా” చిత్ర ప్రదర్శన

బతుకమ్మ ఫిల్మోత్సవంలో ”నువ్వు తోపురా” చిత్ర ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ‘నువ్వు తోపురా’ చిత్ర ప్రదర్శన జరిగింది.

ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చిత్ర దర్శకులు హరినాథ్ బాబు, కో-ప్రొడ్యూసర్ రితేష్ కుమార్ విచ్చేసి ప్రేక్షకులతో చిత్ర అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్ ఓఎస్డి భవానీ శంకర్, సీఎస్ ఓఎస్డి చంద్రమోహన్ విచ్చేసి చిత్రబృందాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులు మరియు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం పాల్గొన్నారు.

22febbcb-4a88-490f-bd0d-a650b6adbf20 43c5b532-c485-4b5d-9e63-dc9f8696311f 348cb450-fe59-437a-a0f4-050465cc0405
<
>