Kalavaibhavam.com (07.09.19): మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి, కథక్, భరతనాట్యం, ఒడిస్సి అంశాల ప్రదర్శనలు

By on Sep 7, 2019 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి, కథక్, భరతనాట్యం, ఒడిస్సి అంశాల ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం అంఫి థియేటర్ లో కూచిపూడి, కథక్, భరతనాట్యం, ఒడిస్సి అంశాల ప్రదర్శన ఎంతగానో అలరించింది.

Texas USA నుండి విచ్చేసిన కళాకారిణి పల్లవి మారేపల్లి కూచిపూడి ప్రదర్శనలో ఆనందనర్థకం, సిద్ధివినాయక, భూ: శంభో, మూషికవాహన, భామాకలాపం, రారావేణు, తందనానా ఆహి అంశాలను ప్రదర్శించారు.

Classically Yours వారు ” నర్థక్ ” అంశాలపై వివిధ శాస్త్రీయ నృత్యాలతో కూచిపూడి దీపక్, భరతనాట్యం కాశీనాథ్, కథక్ శుబ్రత్ సురేఖార్, ఒడిస్సి అవిజిత్ కుందులు వారి వారి శాస్త్రీయ నృత్యాలలో వివిధ అంశాలను ప్రదర్శించారు. గణేష వందన, గోకుల, భటు నృత్య శివభవ, శివ-పార్వతి, తరాన అంశాలను విడి విడిగా మరియు జుగల్ బంధీ గా ప్రదర్శించారు.