Kalavaibhavam.com (07.09.19): యువ కళా వాహిని ఆధ్వర్యంలో గురు ప్రసాద్ మీడియా డైరెక్టరీ 2019 ఆవిష్కరణ

By on Sep 7, 2019 in Other Venues

యువ కళా వాహిని ఆధ్వర్యంలో గురు ప్రసాద్ మీడియా డైరెక్టరీ 2019 ఆవిష్కరణ

ఈరోజు ఉదయం శ్రీ సారథి స్టూడియోస్ ప్రీవ్యూ థియేటర్లో యువ కళా వాహిని ఆధ్వర్యంలో గురు ప్రసాద్ మీడియా డైరెక్టరీ 2019 ఆవిష్కరణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది.

కళాభారతి, డా. జమున ప్రసాద్ మీడియా డైరెక్టరీని ఆవిష్కరించారు. ముందు అట్టమీద, వెనుక అట్టపై ప్రచురించిన శ్రీ బి.సిహెచ్. సుబ్బారావు, లయన్ డా ఏ విజయ్ కుమార్ ర్లను ఘనంగా సన్మానించారు. కళాకారులను, రచయితలను, నిర్వాహకులను, గాయనీ గాయకులను, సాంస్కృతిక ప్రముఖులను సన్మానించి పుస్తకాలు ప్రదానం చేశారు.

సాంసృతికబంధు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా, బాబూమోహన్, కవిత, రోజారమణి, డాక్టర్ కె.వి.కృష్ణకుమారి, కె వేంకటేశ్వర రావు, కళా పత్రిక సంపాదకులు రఫీ, ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డి, ఆకాంక్ష కాటరర్స్ వేణుమాధవ్ అతిథులుగా పాల్గొన్నారు.

తొలుత కుమారి ప్రణతి కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. గాయని పద్మశ్రీ ప్రార్ధనా గీతం ఆలపించారు.

లయన్ వై కె నాగేశ్వరరావు పర్యవేక్షణ, లయన్ భాగి శాస్త్రి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.