Kalavaibhavam.com (10.09.19): సంస్కృతి ఆర్ట్ అకాడెమీ – వరంగల్ నిర్వహించిన 27వ వార్షికోత్సవ ఉత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

By on Sep 10, 2019 in Ravindra Bharathi

సంస్కృతి ఆర్ట్ అకాడెమీ – వరంగల్ నిర్వహించిన 27వ వార్షికోత్సవ ఉత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సంస్కృతి ఆర్ట్ అకాడెమీ – వరంగల్ వారు నిర్వహించిన 27వ వార్షికోత్సవ ఉత్సవం లో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో కళలు, కళాకారుల ను ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ కళాకారులకు రవీంద్రభారతిలో కళా ప్రదర్శనాలకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మన భాషా సంస్కృతి శాఖ ద్వారా రాష్ట్రంలో 6 ప్రభుత్వ సంగీత కళాశాలల్లో తెలంగాణ కళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కళలకు పుట్టిన ఇళ్ళు మన తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కళలు మరుగున పడ్డాయన్నారు. ఇప్పుడిప్పుడే మన కళలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

కాకతీయుల కాలంనుండే పెరణి నృత్యం ఎంతో ప్రజాదరణ పొందిందన్నారు. వీటితో పాటు కూచిపూడి, భరత నాట్యం లాంటి కళారూపాలు ప్రజల ఆదరణ పొందాయన్నారు. ఎంతో మంది కవులను, సాహితి వేత్తలను అందించిన గొప్ప చరిత్ర మన తెలంగాణ కు దక్కుతుంది అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ద్వారా కళాకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా సంస్కృతి ఆర్ట్ అకాడమీ వారిని మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘము రాష్ట్ర కార్యదర్శి హసన్, TGO వరంగల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రావు, TGO జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల విశ్వనాధ్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రముఖ కూచిపూడి నాట్య గురువు కుప్ప పద్మజా, సంస్కృతి ఆర్ట్ అధ్యక్షురాలు లక్ష్మీ తేజస్విత, కూచిపూడి కళాకారులు సంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.