Kalavaibhavam.com (17.08.19): మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు

By on Aug 17, 2019 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు

శనివారం శిల్పారామం ఆంఫి థియేటర్ లో భరతనాట్యం మరియు కథక్ నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి.

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగుళూరుకి చెందిన భరతనాట్య కళాకారులు వీణా గంగాధర్, తేజస్విని సందీప్ లు తమ నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, అమ్బస్తుతి, రాజరాజేశ్వరీ అష్టకం, చెంద్రశేఖరం కృతి, శృంగార లహరి, మంగళం అంశాలను ప్రదర్శించిన తీరు ప్రత్యేకార్షణగా నిలిచింది.

అనంతరం నృత్య కథక్ కళాక్షేత్ర చంద్రతాప సహరాయ్ శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకొంది. సరస్వతి వందన, గణేశవందన, శివ స్తుతి, గురువందన, తరాణా, కృష్ణ స్తుతి మొదలైన అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

శ్రియ, ప్రతీక్ష, ఉపాసన, అస్మిత, అనన్య, ప్రియాంక, సుదీప్త, నవ్య, అమృత, స్పందన, దలిషా, సిమ్రనే, శ్రీనిధి మొదలైనవారు ప్రదర్శించారు.