Kalavaibhavam.com (29.07.19): శిల్పారామం మరియు “చిన్మయి నృత్యాలయ” (Princeton Newjersy, USA) సంయుక్త నిర్వహణలో గురు శ్రీమతి శ్రీదేవి శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి

By on Jul 29, 2019 in Shilparamam

శిల్పారామం మరియు “చిన్మయి నృత్యాలయ” (Princeton Newjersy, USA) సంయుక్త నిర్వహణలో గురు శ్రీమతి శ్రీదేవి శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి

శిల్పారామం మరియు చిన్మయి నృత్యాలయ సంయుక్త నిర్వహణలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గురు శ్రీమతి శ్రీదేవి ముంగర, princeton న్యూ జెర్సీ లో కూచిపూడి నృత్య శిక్షణాలయం “చిన్మయి నృత్యాలయ” ను స్థాపించి ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేసి నృత్య శిక్షణ ఇస్తున్నారు.

బ్రహ్మాంజలి, జతిస్వరం, శుద్ధబ్రహ్మ, కొలువైతివారంగసాయి, నారాయణీయం, బృందావన నిలయం, దేవదేవం భజే నృత్యాంశాలను ప్రదర్శించారు.

నేత్ర, హరిణి, శ్రేయ, దీప్త, జాహ్నవి, నందిత, అంజని, శాన్వి, స్నేహిక మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. చక్కని అభినయం, తాళలయ పద్దతిని అనుకరించి మెప్పించారు.