Kalavaibhavam.com (31.07.19): ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె పురస్కారం ప్రదానం; డా. సినారె అందించిన సేవల వలన తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

By on Jul 31, 2019 in Telangana Basha Parishad

ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె పురస్కారం ప్రదానం 

డా. సినారె అందించిన సేవల వలన తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది 

డా. సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో – పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ  మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా. సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవం లో ప్రముఖ కవి గోరటి వెంకన్న కు సినారె అవార్డును రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

 ‘సినారె వైభవం’ పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివా రెడ్డి, రాష్ట్ర సంగీత నాటక పరిషత్తు చైర్మన్ బాద్మి శివ కుమార్, కవులు యాశీన్, డా.చెన్నయ్య లతో పాటు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కవులను, కళాకారులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి తెలుగు భాషకు ఎంతో ఘన కీర్తి, ప్రతిష్టతలు తీసుకవచ్చారన్నారు. వారు అందించిన సేవల వల్ల తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

డా. సినారె అవార్డు కు ఉమ్మడి పాలమూరు ముద్దు బిడ్డ , ప్రముఖ కవి గోరటి వెంకన్నను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.