Kalavaibhavam.com (31.07.19): ‘సృజన జాతీయ నృత్యోత్సవం 2019’ బ్రోచర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

By on Jul 31, 2019 in Other Venues, Shilparamam

‘సృజన జాతీయ నృత్యోత్సవం 2019’ బ్రోచర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

సచివాలయంలో ‘సృజన జాతీయ నృత్యోత్సవం 2019’ బ్రోచర్ ను రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు  సృజన సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో శిల్పారామం లో  ఆగస్టు 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు  ‘సృజన జాతీయ నృత్యోత్సవం 2019’ పేరుతో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

జాతీయ స్థాయిలో దేశంలోని అన్ని రాష్ట్రాల కళాకారులతో ఒకే వేదికపై కళాప్రదర్శనలను ప్రదర్శించడాన్ని మంత్రి స్వాగతించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి అంజనా చౌదరి, సృజన సంస్థల జనరల్ సెక్రెటరీ రమ్యతేజ లు పాల్గొన్నారు.