Kalavaibhavam.com (31.08.19): శ్రీమ్ స్వస్తి ఫౌండేషన్ (SSF) వారి ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం సంయుక్తంగా నిర్వహించిన ” రససిద్ధి ” ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ అమితంగా ఆకట్టుకుంది

By on Aug 31, 2019 in Shilparamam

శ్రీమ్ స్వస్తి ఫౌండేషన్ (SSF) వారి ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం సంయుక్తంగా నిర్వహించిన ” రససిద్ధి ” ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ అమితంగా ఆకట్టుకుంది

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం అంఫి థియేటర్ లో శ్రీమ్ స్వస్తి ఫౌండేషన్ (SSF) వారి ఆధ్వర్యంలో శిల్పారామం సంయుక్తంగా ” రససిద్ధి ” ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు.

శ్రీవిద్య స్కూల్ విద్యార్థ్హులు మహాగణపతిమ్, ప్రణతి – కొలువైతివా రంగసాయి, వైష్ణవి – ముద్దుగారే యశోద, మీకాసింగ్ – తుమ్మరి, తారాణ, శృతిక – పుష్పాంజలి, వైష్ణవి – నమ: శివాయతే మొదలగునావి ప్రదర్శించారు.

కళాకారులు అందరు పేరిణి, కూచిపూడి, భరతనాట్యం, పేరిణిలాస్యం, కథక్ అంశాలలో ప్రదర్శనలు ఇచ్చారు, ప్రఖ్యాత నాట్య గురువు మునికుంట్ల సాంబశివని ఘనంగా సత్కరించారు.

ప్రదర్శించిన కళాకారులందరికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహించారు.