Kalavaibhavam.com (31.08.19): సందేశాత్మక చిత్రాలను ప్రోత్సహించాలి – సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ” సీక్రెట్ సిగరెట్ ” సందేశాత్మక షార్ట్ ఫిలిం యూనిట్‌ అభినందన సభ

By on Aug 31, 2019 in Ravindra Bharathi

సందేశాత్మక చిత్రాలను ప్రోత్సహించాలి – సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ” సీక్రెట్ సిగరెట్ “ సందేశాత్మక షార్ట్ ఫిలిం యూనిట్‌ అభినందన సభ

లఘు చిత్రాల ద్వారా సమాజానికి ఏదైనా మంచి మంచి సందేశం ఇవ్వాలనే సంకల్పంతో రూపొందించిన “సీక్రెట్ సిగరెట్” అనే సందేశాత్మక షార్ట్ ఫిలిం యూనిట్‌కు ” సందేశాత్మక చిత్రానికి సగర్వ సత్కారం” అభినందన కార్యక్రమం రవీంద్రభారతిలో శనివారంనాడు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

నేటి సమాజంలో బలహీనతలుగా మారిన డ్రంకెన్ డ్రైవ్, సిగరెట్ స్మోకింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ & అందువల్ల జరిగే అనర్థాలను, ప్రమాదాలను ప్రస్తావిస్తూ చిత్రీకరించబడిన సందేశాత్మక షార్ట్ ఫిలిం ” సీక్రెట్ సిగరెట్ ” షార్ట్ ఫిలిం. ఈ సందర్బంగా ఈ షార్ట్లో ఫిలిం నటినటులకు దర్శకుడు అర్జున్ దేవరకొండకు సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు.

ఇంత చక్కటి సందేశాత్మక లఘు చిత్రాలను ప్రోత్సహించడం అభినందనీయమని, ప్రస్తుత సమాజంలో సందేశాత్మక చిత్రాలు రావలసిన అవసరం ఎంతో ఉందని పలువురు వక్తలు అన్నారు. ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుత సమాజానికి ఒక మంచి సందేశమని, ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రమోట్ చేసిన డా. కొత్త కృష్ణవేణి, కొత్త శ్రీనివాస్ లకు పాల్గొన్న అతిధులు అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు, శాసనసభ్యులు ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక సంస్థ చైర్మన్ శివకుమార్, బిసి కమీషన్ మెంబర్ వకుళాభరణం కృష్ణమోహన్ తతిదారులు హాజరైనారు. సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ శర్మ, దివ్యాంగ సంఘాల సభ్యులు, చిత్ర నిర్మాతలు శ్రీమతి & శ్రీ జ్యోతి వెంకటేష్ మరియు కౌశిక్ చాగంటి, చిత్ర యూనిట్ సభ్యులు నాగేంద్ర, వెంకీ సిద్ధార్థ, గోపి, క్రాంతికుమార్, వెంకీ పాల్గొన్నారు.

(Photos Courtesy: Kotha Deepak Patel)