Kalavaibhavam.com(29.11.19): గవర్నరు చేతులమీదుగా “నాన్న శతకము” పుస్తకావిష్కరణ

గవర్నరు చేతులమీదుగా “నాన్న శతకము” పుస్తకావిష్కరణ

భద్రాద్రి శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ నాన్న గొప్పతనం గురించి తెలియచెప్పే విధంగా 101 పద్యాలతో కూడిన నాన్న శతకము పేరుతో రచించిన పుస్తకాన్ని ఈరోజు రాజ్ భవన్ లో గవర్నరు డా.  తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ నాన్న గురించి చక్కగా కవిత్వీకరించారు ఆయనకు అభినందనలు అని మరియు చందా సీతారాములు, గవర్నరు సహాయ కార్యదర్శి / అనుసంధాన అధికారి తన తండ్రి కి.శే. శ్రీ చందా గోపాలకృష్ణమూర్తిని గుర్తుచేసుకుంటూ ఈ పుస్తకాన్ని ముద్రించడం ప్రశంసనీయం అని గవర్నరు అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నరు కార్యదర్శి సురేంద్రమోహన్ పాల్గొన్నారు.