కుజ దోషం ఉన్న అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తే కుజదోషం పోతుందా?

By on Feb 13, 2020 in Other Venues

ఎస్. బాస్కర్ సింగ్, యం.ఎ., భాస్కర జ్యోతిష్యాలయం, సాయి ప్యాలెస్ ఎదుట, జి.బి.సి రోడ్, బాపట్ల – సెల్. 9885407113

కుజ దోషం ఉన్న అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తే కుజదోషం పోతుందా?

కుజదోషం – మంగళిక దోషం అెటే ఏమిటి – అవి ఏ విధముగ ఉంటాయి.చాలా మంది జ్యోతిష్యుల , పూజారులు, పండితులు జాతక చక్రము వేసినపుడు వారు పుట్టిన నక్షత్రం రాశి లగ్నమునకు అదిపతులు కుజుడు అయిన వారికి కుజదోషము (మంగళిక దోషము) ఉందని అంటారు,అదే వారిని ఆ కుజదోషము ఏ విధముగ ఉన్నది చెప్పమంటే అది చెప్పటానికి చాలా సమయము పడుతుంది. అందుకేవారు కుజదోషము ఉంది మీరు రాహువు, కేతువులకు శాంతి చేయించిన కుజదో,ము పోతుంది అని చెపుదురు.కాని అది కంత సమంజసం కాదు. ఎందుకంటే వాటి గురించి జాతక చక్రమునందు గల గ్రాహాల ఆ వ్యక్తి యొక్క కుజదోషము ఏ విధముగా ఉందో మనవారు అనేక మంది జ్యోతిశ్య పండితులు కుజదోషములు ఏ విధముగా ఉంటాయో వాటిని ఏ విదముగ పరిష్కిరంచవలెనో వారి అనుభవములు తెలిపారు.

అదే వివిధ జాతక చక్రము నిశ్చితంగా లేదా లోతుగా పరిశీలించి ఆ వ్యక్తి యొక్క కుజదోషము (మంగళిక దోషము) ఏ విధముగ ఉన్నది తెలుసుకొని ఆ గ్రహాలు ఏమి చేస్తాయి. వాటి ఉన్న స్థానము అంటే లగ్నము నుండి అవి ఏ స్థానములో ఉన్నది తెలుసుకొని వాటిని ఏ విధముగ పరిష్కరించ వచ్చునో తెలుసుకొని వాటికి పరిహారములు చేసుకొని వాటి నుండి తప్పించు కొనవలెను.

కుజదోషం ఉన్న అమ్మాయికి కుజ దోషం ఉన్న అబ్బాయికి వివాహం చేస్తే కుజదోషం నివారణ అవుతుందా అంటే,కుజదోషం నివారం కాదు, ఎందుకంటే జాతకుని జన్మకుండలిలో ఏవిధంగా ఉన్నది పరిశీలించిన, కుండలిలోని మిగలిన గ్రహాలు అవి ఏ విధంగ ఉన్నవి తెలుపుతాయి. ఉదాహరణకు కొంతమంది జాతక చక్రంలో కుజ దోషం ఈ విధంగా చూపబడతాయి.

 1. 24 సం. నుండి 27 సం. మధ్య వివాహం జరగకూడదు అంటే ఆ వ్యక్తికి 24 సం. నుండి 27 సం. మధ్య వివాహం జరగడం వారి యొక్క జీవితం అస్తవ్యస్తంగా జరుగును.
 2. భార్య లేదా భర్తతో సన్నితంగా ఉండడు.
 3. ప్రేమల్లో పడితే నష్టపోతాడు అంతే కాకుండా ఆ వ్యక్తికి వృతిపరంగా సిద్దపడక ముందే వివాహం జరుగును.
 4. అత్తగారంట చెడ్డపేరు తెచ్చుకుంటాడు.
 5. రండు వివాహములు జరుగుతాయి.
 6. రెండు వివాహాలు చరుగుతాయి అని చెప్పను. అంతేకాక అ వ్యక్తి అబ్బాయి అయితే తండ్రికి, అమమాయి అయితే తల్లికి 21 సం. లేదా 42 సం. ల్లో ప్రమాదము జరిగే అవకాశం కలదు.
 7. 28 సం. తరువాతనే వివాహం జరుగుట మంచిది. 
 8. వివాహం ఆలస్యంగా జరుగును అంతేకాక ప్రేమకోసం ఏ పని అయిన చేయుటకు సిద్దపడుతాడు.
 9. కొంత మందికి రెండు వివాహాలు జరిగే అవకాశం కలదు.
 10. జాతకునికి 24 సం. వయస్సు దాటిన తరువాత వివాహం జరుగుట మంచిది.
 11. 22 – 25 సం.ల వయస్సులో వివాహం చేసుకుంటే , బార్య (భర్త) ను కోల్పోవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు. భార్య ఆరోగ్యం క్షిణిస్తుంది.
 12. అలస్యంగా సంతానాన్ని పొందుతాడు.
 13. స్త్రీ సుఖం లేదా పురుష సుఖం లభించదు . అంటే వివాహం జచరుగుట కష్టం.
 14. భార్య, భర్తల మధ్య కలతలు ఏర్పడతాయి. అవి చివరకు విడాకుల వరకు దారితీస్తాయి.
 15. జాతకునికి బహు భార్య యోగం లేదా బహు భర్త యోగం ఉండును.
 16. బిడ్డ పుట్టుకలో ముందు కాలు గర్భం నుంచి బయటకు వస్తకే తండ్రి, అదే అమ్మాయి  అయితే తల్లికి ఆపద.
 17. కనీసం రెండు వివాహాలు జరుగుతాయి.

తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి జాతక చక్రమునందు మిగిలిన గ్రహాలను అద్యయనను చేస్తే అవి ఏ రకంగా ఉన్నవి తెలియజేస్తాయి.

ఈ విధముగ జాతక చక్రమలు వివిధ గ్రహాలు ఉన్న స్థానాలు మరియు మిగిలిన గ్రాలు బలమును బట్టి ఆ  జాతక చక్రములోని బల మరియు బలహీనతలు మరియు అవి ఏ విధముగ ఉన్నను వారి తల్లి, తండ్రుల పుణ్యము వలన వాటిని అదిగమించవచ్చును. అందుకే అంటారు తల్లి దీవెన బ్రహ్మ దీవెన.

కావున జాతకులు పుట్టిన సమయము ఏ విధముగ ఉన్నను అంటే బ్రహ్మరాత ఏవిధముగ ఉన్నను ఆ జాతకుని బ్రహ్మరాతను కూడ మార్చగల శక్తి ఆ తల్లికి కలదు, అందుకే తల్లి దీవెన బ్రహ్మదీవెన అంటారు.

అదే విధముగ భక్త మార్కెండేయుడు అల్పాయుష్యవంతుడైనను ఆ మృత్యువును ఏ విధముగ జయించవచ్చునో నారద మహాముని భక్త మార్కెండేయుని తండ్రికి మృత్యువును ఏ విధముగ జయించవచ్చునో తెల్పి దీర్ఘాయుఘవంతుడయ్యెను.

కావున ప్రశ్న ఉన్న చోట దానికి సమాదానము తప్పక ఉండును 

ఈ విధముగా వ్యక్తి యొక్క జాతకము చక్రములు కుజదోషములు ఏవిధముగా ఉంటాయో తెలువును.

అదే విధముగా తల్లి, తండ్రులు చేసిన పాపాలు కూడా తమ పిల్లలపై పడతాయి. దానివలన వారి పిల్లలకు వివాహాలు జరగకపోవడం, వారి యెక్క జీవతముల అసవ్యస్తముగా ఉండును . ఉదా దశరధ మహారాజు వేట నిమిత్తము వెళ్ళగా శంతన కుమారుడు వారి తల్లిదండ్రులుకు నీరు కోసం చెరువు గట్టుకు వెళ్ళి కుండను ముంచగా దాని శబ్దమును దశరధ మహారాజు పులి అనుకోని శబ్దబేది విద్య ద్వారా బాణం ప్రయోగించెను. ఆ బాణం తగిలి ఆ ముని కుమారుడు అమ్మ అని కేకే వేసెను. అపుడు దశరధ మహారాజు అక్కడకు వచ్చెను. తన తల్లిందడ్రులకు ముందు దప్పిక తీర్చమని చెప్పి ప్రాణములు వదిలెను. అంత దశరధ మహారాజు ఆ ముని దంపతులకు నీరు ఇచ్చి దప్పిక తీర్చి జరిగిన సంగతి చెప్పగా ఆ ముని దంపతులు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు, తప్పే అని నీవు కూడా నీ మరణ సమయము నీ కుమారులు నీ దగ్గర ఉండరు అని చెప్పి మరణించిరి. కాని ఆ ముని దంపతులు శాపము దశరధ మహారాజుకు సంతానం లేదని బాధపడుచుండగా తనకు కుమారులు పుటుదరని తెలిసి సెతోషించేను.

కొన్ని సార్లు శాపములు అంటే (అత్మ) హృదయ ఘోష చాలా ప్రభుత్వము చూపును. ఇది నా యెక్క పరిజ్ఞానము ద్వారా న అనుభవము ద్వారా నాకు తెలిసినది మాత్రమే ఇక్కడ తెలుపు చున్నాను.

*Article Curtesy: ఎస్. బాస్కర్ సింగ్, యం.ఎ., భాస్కర జ్యోతిష్యాలయం, సాయి ప్యాలెస్ ఎదుట, జి.బి.సి రోడ్, బాపట్ల – సెల్. 9885407113.

*S. Bhaskar Sing from Bapatla, Andhra Pradesh is an Astrologer and author for this article. Views expressed in the article are author’s personal.