Kalavaibhavam.com (15.08.19): 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శనలు

By on Aug 15, 2019 in Shilparamam

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శనలు

73వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామంలోని ఆంఫిథియేటర్ లో భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.

బెంగుళూరుకి చెందిన దిక్ సూచి నాట్యాలాయ శ్రీమతి దివ్య శివనారాయణ శిష్యబృందం పుష్పాంజలి, గణేశ శ్లోకం, నటరాజ స్తోత్రం, కాలభైరవాష్టకం, తేనే తేటల మాటలతో మన దేశమాతను కొలిచెదమా, దేశం మనదే, బృందావని థిల్లాన, వందేమాతరం అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

తరువాత వైష్ణవి నాట్య సెంటర్ శ్రీమతి వైష్ణవి సాయినాథ్ శిష్య బృందం కుమారి మహతి సిస్టలా, కుమారి కాయారత్ సంజన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.