Kalavaibhavam.com(9-Feb): మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నకర్ణాటక గాత్ర కచేరీ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Feb 9, 2020 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్నకర్ణాటక గాత్ర కచేరీ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఆదివారం మాదాపూర్ శిల్పారామంలో కర్ణాటక గాత్ర కచేరీ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

శ్రీమతి శివానీ సరస్వతుల కర్ణాటక గాత్ర కచేరీ ఎంతగానో అలరించింది. నిన్నే భజన, త్యాగరాజ యోగ వైభవం, అపరామ భక్తి, కృష్ణా నీ బేగనే, బ్రహ్మమొక్కటే, గోవింద సుంద, గరుడ గమన తవ, క్షీరాబ్ది కన్యకకు నీరాజనం మొదలైన పాటలను ఆలపించారు. వీరికి వయొలిన్ పై రాజశేఖర్ మరియు మృదంగం పై రామకృష్ణ సహకరించారు.

చిన్మయి నృత్యాలయ గురువు శ్రీమతి శ్రీదేవి ముంగర గారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గణేశ కాతం, జతిస్వరం, నారాయణీయం, అంబాష్టకం, ఎందరో మహానుభావులు, వందే వాసుదేవం, థిల్లాన అంశాలను సృజన, జాహ్నవి, నవ్య, నేహా, దీప్తా, నేత్ర, హరిణి, అంజన, నందిత మొదలైన వారు ప్రదర్శించారు.