Kalavaibhavam.com(12-Jan): మాదాపూర్ శిల్పారామంలో భరతనాట్యం, ఆంధ్రనాట్యం, ” గొట్టిపువా” నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి

By on Jan 12, 2020 in Shilparamam

మాదాపూర్ శిల్పారామం లో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ 2019 సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కుమారి శ్రీమ ఉపాధ్యాయ తన ప్రదర్శనలో భాగంగా కంద అలరింపు, జతిస్వర, దేవర్ నామ, సుమనసరిజిని డిల్లాన అంశాలను ప్రదర్శించారు.

ప్రముఖ ఆంధ్రనాట్యం మరియు పేరిణి నృత్య కళాకారులూ పేరిణి కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన ఆంధ్రనాట్యం కుంభహారతి, పుష్పాంజలి, అలరిపు, వినాయకాతం, దశావతారాలు, నవజనార్దపారిజాతం దరువు అంశాలను స్రవంతి, తులసి, రూప, స్వాతి, ప్రణీత, ప్రదీప్తి, అమృత, సాయి రష్మిక, శ్రీ వర్షిణి, దాక్షమని మొదలైన వారు ప్రదర్శించారు.

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కళాకారుల బృందం ” గొట్టిపువా” నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.