Kalavaibhavam.com(8-Feb): మాదాపూర్ శిల్పారామంలో అలరించిన ఒడిస్సి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Feb 8, 2020 in Shilparamam

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన ఒడిస్సి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం మాదాపూర్ ఆంఫి థియేటర్ లో ఒడిస్సి మరియు కూచిపూడి నృత్యాలు అలరించాయి.

భువనేశ్వర్ నుండి విచ్చేసిన ఒడిస్సి కళాకారుడు సూరజ్ కుమార్ తన ప్రదర్శనలో భాగంగా గణేశమంగళా చరణ్, స్థాయి, నృత్యప్రధానమైనది మరియు దశావతార శబ్దం అంశాలను చక్కని అభినయంలో ప్రదర్శించి మెప్పించారు.

కలర్స్ అఫ్ డాన్స్ అకాడమీ గురు ఎన్.ఎస్.ఎల్. ప్రవీణ్ శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా పూర్వరంగం, వినాయక కాతం, ప్రభొగణపతే, బ్రహ్మాంజలి, ముద్దుగారే యశోద, బ్రహ్మమొక్కటే, శ్రీరామ చంద్రకృపాలు, జతిస్వరం, నమఃశ్శివాయతే, మంగళం అంశాలను లక్ష్మి ప్రియ, నిశ్చల, కీర్తన, అక్షిత, వేణిరెడ్డి, గ్రీష్మ మొదలైన వారు ప్రదర్శించారు.