Kalavaibhavam.com(2-Feb): కళాతపస్వి సంస్కృతికి విజయ నీరాజనం

By on Feb 2, 2020 in Other Venues

కళాతపస్వి సంస్కృతికి విజయ నీరాజనం

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ శంకరాభరణం చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకున్న శుభదినాన్ని పురస్కరించుకొని బాల సచ్చిదానందం సంగీత నృత్య నీరాజనం

జయగురుదత్త: కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ శంకరాభరణం మనోజ్ఞమైన దృష్యకావ్యం చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకున్న మరపులేని శుభదినాన్ని పురస్కరించుకొని బాల సచ్చిదానందం చిన్నారి కళాకారులు విశ్వనాథ్ ఇంటి వద్దనువ్న సాయిబాబా ఆలయంలో (జూబిలీ హిల్స్) తమ సంగీత నృత్య నీరాజనాన్ని సమర్పించి బాబా దీవెనలు, కళాతపస్వి ఆశీస్సులు అందుకున్నారు.

శ్రవణ, నయనానందంగా సాగిన ఈ వేడుకలలో చిన్నారులు సహస్ర, లేఖన, తరుణి, జయనిల నృత్యాలు మురిపించి కరతాళధ్వనుల నీరాజనాలందుకున్నాయి. మధుర చిట్టి గాయని శరణ్యాక్షిత(సిరి) పాడిన పాటలు, భాగవత పద్యాలు మనోరంజకం చేశాయి.

సంగీత గురు దిగ్గజం శంభుని మయూరి, నాట్య గురువు అపర్ణ, గాయని రేవతి, గాయకుడు సంగమేశ్వర్, మాతృమూర్తి అన్నపూర్ణల చిత్ర శ్రావ్య గీతాంజలి మనసులు దోచుకున్నాయి.

ముఖ్య అతిథిగా విచ్చేసిన SVBC ఛానల్ ప్రోగ్రాం దర్శక, నిర్మాత పి. ‌వేణుగోపాలరావు విశ్వనాథ్ శంకరాభరణం గురించి అది సృష్టించిన సంతలనాన్ని గురించి .. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల పరిరక్షణలో విశ్వనాథుని పాత్రపై కమనీయమైన ప్రసంగం చేసి కళాకారులను శాలువాలతో సత్కరించి కళాపీఠం గురు రత్నాకర శర్మ బాలల లోకానికి చేస్తున్న అమూల్యమైన సేవలను అభినందించారు.

కళాపీఠం చిన్నారులతో ఒక షార్ట్ ఫిలింగాని, పూర్తి నిడివి గల చిత్రాన్ని తీయనున్నట్లు హర్శధ్వానాల మధ్య ప్రకటించారు. కళావైభవం.కామ్ అధినేత, పాత్రికేయులు కె. ఎల్. నరసింహా రావు కార్యక్రమ సమన్వయం చేయగా కళాపీఠం అధ్యక్షులు యం.ఆర్. శర్మ బాబా దేవాలయ చైర్మవ్ గౌతంకి, సిబ్బందికి, బాల మందారాలకు, తల్లిదండ్రులకు ఆహూతులకు కృతజ్ఞాతాభివందనాలు సమర్పించారు.

బాబా అన్నప్రసాద వితరణ, విశ్వనాథుని దర్శనంతో కార్యక్రమం ముగిసింది.