Kalavaibhavam.com (09.09.19): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా “తెలంగాణ భాషా దినోత్సవం – ప్రజాకవి పద్మవిభూషణ్ కీ.శే. కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం”; పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌; కోట్ల వెంకటేశ్వరరెడ్డికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా “తెలంగాణ భాషా దినోత్సవం – ప్రజాకవి పద్మవిభూషణ్ కీ.శే. కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం”; పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌; కోట్ల వెంకటేశ్వరరెడ్డికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం

సోమవారం రవీంద్రభారతిలో  రాత్రి ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం- తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

పాల్గొన్న అతిధులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కాళోజీ చిత్రపటానికి పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *