తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఘనంగా డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారాల ఆరో రోజు (27.07.18) జయంతి వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన డా. అయాచితం శ్రీధర్, డా. లక్ష్మణ చక్రవర్తి ప్రత్యేక ప్రసంగం “తెలంగాణ కవిత్వం – ఆలంకారికత” ఎంతో ఆకట్టుకుంది

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఘనంగా డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారాల ఆరో రోజు (27.07.18) జయంతి వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన డా. అయాచితం శ్రీధర్, డా. లక్ష్మణ చక్రవర్తి ప్రత్యేక ప్రసంగం “తెలంగాణ కవిత్వం – ఆలంకారికత” ఎంతో ఆకట్టుకుంది.

ఈ ఆరో రోజు (27.07.18) శుక్రవారం జరిగిన కార్యక్రమానికి డా. అమ్మంగి వేణుగోపాల్ అద్యక్షత వహించి ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ డా. అయాచితం శ్రీధర్ హాజరై ప్రసంగించారు.

ప్రత్యేక ప్రసంగంలో డా. లక్ష్మణ చక్రవర్తి “తెలంగాణ కవిత్వం – ఆలంకారికత” అనే అంశంపై మాట్లాడారు. సాహిత్యంలో ఆలంకారికత యొక్క ప్రాముఖ్యతను చాల చక్కగా వివరించారు.

ఆరో రోజు కవి సమ్మేళనంలో కవులు పాల్గొని వారి కవితలను చదివి వినిపించారు. ఈ రోజు జరిగిన కవి కార్యక్రమాలు సాహీతీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ డా.నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, పలువురు కవులు, తదితరులు పాల్గొన్నారు.

28న తెలంగాణ కవిత్వ విమర్శపై డాక్టర్‌ జి. బాల శ్రీనివాసమూర్తి, 29న మహాకవి సి.నా.రే. కవితా ప్రస్థానం పై ప్రసంగాలు ఇవ్వనున్నారు.

1b499c41-7041-4fe5-89b8-9badf0562495 3f2456c6-6d51-4fc0-a1d9-4d74a03803ed 34cba9b0-af46-40fe-9a15-061976137821 897c679f-93d2-4033-9cd8-0ecf2812ecfe 51183b04-bfd7-48c9-ae51-05f57b1f7191 IMG_20180727_183613738 IMG_20180727_195535640 IMG_20180727_195822979 IMG_20180727_200044791_BURST001 IMG_20180727_200046885 IMG_20180727_200428646 IMG_20180727_200804076 IMG_20180727_201011186 IMG_20180727_201225808 IMG_20180727_201709263 IMG_20180727_201906583 IMG_20180727_202852431 Sahitya 6th Day Program 27.07.18 IMG_20180727_201011186
<
>