కావ్యం ఎంపికే కాదు వక్త కూడా ముఖ్యమే – నందిని సిధారెడ్డి

కావ్యం ఎంపికే కాదు వక్త కూడా ముఖ్యమే – నందిని సిధారెడ్డి

హైదరాబాద్, ఆగష్టు 10, కళావైభవం.కామ్:  రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హల్లో తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి రెండవ వారం నిర్వహించే కావ్యపరిమళం కార్యక్రమంలో భాగంగా ఇవాళ 10 .08.18 శుక్రవారం జరిగిన ‘కావ్యపరిమళం – 5’ లో చరిగొండ ధర్మన్న “చిత్రభరతం” పై తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి గారి అద్యక్షతన డా. సంగనభట్ల నరసయ్య గారు ప్రసంగించారు.

డా. సంగనభట్ల నరసయ్య చరిగొండ ధర్మన్న “చిత్రభరతం” పై ప్రసంగిస్తూ… చిత్రభరతం యొక్క విశేషాలను చాల చక్కగా వివరించారు. తెలంగాణ కవులు కలాలకు పదునుపెట్టడంలోనే కాదూ.. తెలంగాణ జానపద గాథలకు పుట్టినిల్లుగా ఉందన్నారు.

ఒక కావ్యం గురించి తేలియని సమయంలో మన ఆలోచనలు ఎలా వుంటాయో, దాని గురించి తెలిసిన తర్వాత మన ఆలోచనాసరళి ఎలా ఉంటుందనేదానిపై మానసిక సంఘర్షణ ఎంత లోతైన విశ్లేషణ చేస్తుందన్నది మన హృదయమే తెలియజేస్తుందని ఈ కార్యక్రమానికి అద్యక్షతవహించిన తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు.

తెలంగాణ కావ్యపరిమళాలు చరిత్రకందని కావ్యాలు, తెలంగాణ వైభవాన్ని వెదజల్లుతూనేవున్నాయి. చిత్రభారతం అన్నది ఎంత దీక్షగా వినాలన్న ఆసక్తి ఎంత ముఖ్యమో దీక్ష కుడా అంతే ముఖ్యమైందని గుర్తు చేసారు. తెలంగాణ కవుల గురించి ఎంతో కొంత అవగాహన అందరికి వుంది. కానీ చెలిగొండ ధర్మన్న గురించి నాకు పెద్దగా పుస్తక పరిచయంకూడా లేదు. అయన ఒక కవిగా మాత్రమే నాకు తెలుసు. అయన పుస్తకరచన నేను చదవలేదు. వినే అవకాశం ఎప్పుడు రాలేదు. కావ్యపరిమళం ఐదు (5) కు చరిగొండ ధర్మాన్నను ఎంచుకొన్నపుడు అందులో ఏముందన్న మాటలు కూడా విన్నాను. కానీ ఏమి లేదనేది కూడా ఒక విశేషమే అనుకున్నాను. కొన్నిసార్లు మనకు ఏమి తెలియని దానిగురించి కూడా ఎంతో చర్చించుకునే సందర్భాలుంటాయి. తెలంగాణ కవులు కావ్యపరిమళాలు ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఈ సదస్సులో చిత్రభారతంలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేదాం అనుకున్నాను. చిత్రభారతం గురించి తెలుసుకుంటే గదా అందులో ఏమున్నది తేలేది అన్న నిర్ణయం తీసుకున్నానన్నారు. తెలంగాణ కవుల కావ్యపరిమళాలు తెలంగాణ సమాజానికి తెలియజేసేందుకు ఈ పదయజ్ఞం చేపట్టామని సిధారెడ్డి అన్నారు.

తెలిసిందన్న విషయాల గురించి తెలియాల్సిన అవసరం లేదు. అయితే తెలియని కావ్యం గురించి చదవక్కర్లేదు. అయితే చదవక్కర్లేదు అన్న కావ్యంలో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అందులో కావ్యపరిమళం ఎలా వికసించిందన్న ఆసక్తి కూడా పెరిగుతుంది. చదవకపోయినా, ఒక కావ్యపరిమళం గురించి వినడం కూడా ఎంతో ముఖ్యమని అయన అన్నారు. ఎందుకంటే రసాస్వాదనలో వినసొంపైన వాటిపై చెవులకు వున్న ఆస్వాదన ఎంత గొప్పదో ఒక్క మాటలో చెపుతాను. ఎందుకంటే చెవులు వినడం ద్వారా పొందే ఆనందాన్ని ఆభరణాలను అలంకరించుకుంటే ఆనందించవని ఎక్కడో విన్నాను. ఆ మాటలు ఎంత అందంగా ఉన్నాయో, చెవుల ఆనందం కూడా అంతే శోభాయమనం అన్నది తెలుసుకున్నానన్నారు. అందువల్ల వినడం అన్నది ఈ కాలానికి ఎంతో అవసరం. నేటి యువతకు ఇంకా అవసరం. ఎందుకంటే నేటి తరం ఎవరు చెప్పిన వినే పరిస్థితి లేదు. ఈ తరానికి తెలంగాణ భావోద్వేగంతో వున్న ప్రతిభను పరిచయం చేయాల్సిన అవసరం వున్నది. తెలుగు సాహిత్యంలో ఎంతో మంది మరుగున పడిన తెలంగాణ కవులు వున్నారు. ఆ కవుల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. కవులు తన కావ్యాల వల్లవెలిగినా, అవి చీకట్లో మగ్గడం మూలంగా, మరుగునపడిపోకూడదన్నదే తెలంగాణ సాహిత్య అకాడమి ఉద్దేశమన్నారు. వాటిని వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతను తన భుజాన మీద వేసుకొని తెలంగాణ సాహిత్య అకాడమి, సాహిత్య పరిమళాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

అయితే ఇక్కడ కావ్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో వక్తను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి సందర్భంలో డా. సంగనభట్ల నరసయ్య ఒక్కరే ఈ కావ్యలంకారణ పరిమళాలు మన కళ్ళముందు ఆవిష్కరిస్తారని తెలుసుకొని ఎంచుకోవడం జరిగిందన్నారు.

చరిగొండ ధర్మన్న చరిత్రను నేటి తరానికి అందించే యజ్ఞం చేసిన వ్యక్తి సంగనభట్ల నరసయ్య అని అన్నారు. కాలానిర్దారణ, చరిత్ర పరిశోధన అన్నది ఎంత గొప్పదో కూడా తెలుసుకోవాలి.

నిజానికి ఈ ఆవిష్కరణలు ఏర్పాటుచేసిందే తెలంగాణలో మరుగున పడిన ఎంతో మంది కవుల కావ్య పరిమళాలు భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే తమ లక్ష్యమని, అట్టి కవుల గురించి ఒక ఫోకస్ . ఒక కేంద్రీకృతమైనటువంటి కాంతిని.. ప్రసురింపచేయాలని, వారిని వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ కావ్యపరిమళాలు ఏర్పాటు చేసామని మరోసారి సిధారెడ్డి అన్నారు. సాహిత్యాభిమానుల ఆదరణే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి స్వాగతం పలికారు. సాహిత్యప్రియులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *