Kalavaibhavam.com(7-Feb): ఏరోస్పేస్ పార్క్ ను సందర్శించిన యునైటెడ్ కింగ్ డమ్ (U.K.) జర్నలిస్టుల బృందం

By on Feb 7, 2020 in Other Venues, World Culture

ఏరోస్పేస్ పార్క్ ను సందర్శించిన యునైటెడ్ కింగ్ డమ్ (U.K.) జర్నలిస్టుల బృందం

నగరంలో పర్యటిస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) కు చెందిన జర్నలిస్టులు, , ఎడిటర్ల తో కూడిన బృందం శుక్రవారం శంషాబాద్ లోని ఏరోస్పేస్ పార్క్ ను సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుండి ఈ బృందం హైదరాబాద్ లో పర్యటిస్తుంది.

తమ పర్యటనలో భాగంగా చివరి రోజైన శుక్రవారం బృందం ఏరోస్పేస్ పార్క్ ను సందర్శించి , పార్క్ లోని విమానాల విడిభాగాల అమరిక, మరమ్మత్తు పనులు, నిర్వహణ సామాగ్రిని పరిశీలించింది. పార్క్ లోని ఎయిర్ స్పేస్ విశేషాలను జి.ఎం.ఆర్ సంబంధిత అధికారి సౌరబ్ జైన్ వివరించారు. అంతకు ముందు ఈ బృందం గచ్ఛిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) ను సందర్శించింది. స్కూల్ అకాడమిక్ విశేషాలు, నియమక ప్రక్రియ, విద్యార్ధులకు అందిస్తున్న సేవలు , బిజినెస్ రంగంలో స్కూల్ ప్రాధాన్యతను సంబంధిత ఐ.ఎస్.బి. ప్రతినిధి గురు బృందానికి తెలియజేశారు. అనంతరం టి.సి.ఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ) సినర్జీ పార్క్ ను సందర్శించింది. ఐ.టి. రంగంలో టి.సి.ఎస్ కృషి , నియామకాలు, స్టార్టప్ లకు ప్రోత్సాహం, ఐ.టి. సేవల గురించి టి.సి.ఎస్ ఆపరేషన్స్ హెడ్ రాజు ఈ బృందానికి వివరించారు.

మీడియా అకాడమీ అఫ్ తెలంగాణ సెక్రటరీ విజయ గోపాల్ , సమాచార,  పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్ , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు దేవేందర్ కుమార్, సుధాంశ్ కుమార్, సమాచార , పౌర సంబంధాల శాఖ అధికారి బాజ్ పేయ్ , యు.కె. కు చెందిన ఏడుగురు జర్నలిస్టులు, ఎడిటర్లు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఈ బృందం తిరిగి ఢిల్లీ వెళ్ళింది.