Kalavaibhavam.com(8-Feb): ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Feb 8, 2020 in Shilparamam

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం ఆంఫి థియేటర్ లో కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. సంస్కృతి స్కూల్ పిల్లలు చక్కటి పాటలు పాడారు. టి.ఎస్. కళా సమితి గురువు శ్రీమతి కళ్యాణి భవ్య పర్యవేక్షణలో కళాకారులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.