తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో గురువారం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్ర ప్రదర్శన

‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్ర ప్రదర్శన

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న బతుకమ్మ ఫిల్మోత్సవం (2019)లో గురువారం సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చిత్ర దర్శకుడు నాగసాయి మాకం, హీరో మాగంటి శ్రీనాథ్, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, నటులు మల్లేష్ బలస్ట్, సాయికిరణ్ విచ్చేసి ప్రేక్షకులతో చిత్ర అనుభవాలను పంచుకున్నారు.

దర్శకుడు నాగసాయి మాట్లాడుతూ… పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తెలంగాణ మాండలికానికి పెద్ద పీటవేస్తూ ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా సినిమాను రూపొందించామని అన్నారు. ఆద్యంతం సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో సాగిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని పేర్కొంటూ సినిమాకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

హీరో మాగంటి శ్రీనాథ్ మాట్లాడుతూ… ప్రతి సన్నివేశం సహజంగా సాగడం ఈ సినిమా గొప్పతనమని, చుట్టూ జరుగుతున్న వాటిని కథగా చేసుకొని దర్శకులు నాగసాయి సినిమాను తెరకెక్కించారన్నారు. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ ఎక్కడా రాజీ పడకుండా కథకు తగినట్లుగా ఈ చిత్రాన్ని నిర్మించారని, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పేరు తీసుకొచ్చిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రవీంద్రభారతి ఇంచార్జ్ గోవిందరావు, యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులు మరియు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ టీం పాల్గొన్నారు.