మహాత్మ గాంధీ 150 వ జన్మ దినం సందర్భంగా బీజేపీ బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్, దమ్మాయిగూడా ఇంచార్జి గీతా మూర్తి అధ్యక్షతన ‘ గాంధీ సంకల్ప యాత్ర ‘

ఈ రోజు దమ్మాయిగూడా , హైదరాబాద్ లో మహాత్మ గాంధీ 150 వ జన్మ దినం సందర్భంగా ‘ గాంధీ సంకల్ప యాత్ర ‘ చెపట్టడం జరిగింది. బీజేపీ బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ మరియు దమ్మాయిగూడా ఇంచార్జి శ్రీమతి గీతా మూర్తి అధ్యక్షత న ఈ సమావేశం జరిగింది. ఈ యాత్ర లో ప్రధానమంత్రి మోదీ గారు తల పెట్టిన ప్లాస్టిక్ ముక్త్ భారత్ , స్వచ్ భారత్, ఆయుష్మాన్ భారత్, సురాజ్య స్థాపన, యోగ, ఉజ్జ్వల, ధూమ పాన నిషేధం, లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ యాత్ర లో చేపడ్తామని గీతా మూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడా బీజేపీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, బాపి రెడ్డి, సునీల్, సంపత్,శాంతి, సుజాత, కమల్, ఇత్యాది నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 31 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొన సాగుతాయని వెల్లడించారు