Kalavaibhavam.com(14-Feb): తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో “నవలా స్రవంతి” కార్యక్రమం – 11వ భాగంలో దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు ” లోపలి మనిషి ” నవలపై ప్రసంగించిన ముఖ్య అతిధి సీనియర్ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో “నవలా స్రవంతి” కార్యక్రమం – 11వ భాగంలో దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు ” లోపలి మనిషి ” నవలపై ప్రసంగించిన ముఖ్య అతిధి సీనియర్ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ప్రతి నెలా రెండవ శుక్రవారం నిర్వహించే సాహితీ ప్రక్రియ “నవలా స్రవంతి” కార్యక్రమం – 11వ భాగంలో దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు ” లోపలి మనిషి ” నవలపై ప్రసంగ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్ర రవీంద్రభారతి సమావేశమందిరంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీనియర్ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి హాజరై “లోపల మనిషి” నవలపై ప్రసంగం చేసారు.

ఈ సభకు తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి అధ్యక్షత వహించగా, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి “లోపల మనిషి” నవలను సభకు పరిచయం చేసారు. నవల సాహితీ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, రచయితలు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.