Kalavaibhavam.com(17-May): హనుమజ్జయంతిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ ఆంజనేయస్వామివారికి విశేషపూజలు

హనుమజ్జయంతిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ ఆంజనేయస్వామివారికి విశేషపూజలు

Vishesha pooja performed to Sri Anjaneya Swamy Varu on the occassion of Hanuman Jayanti at Srisailam Temple

17.05.2020 Hanuman Jayanti Photos (2) 17.05.2020 Hanuman Jayanti Photos (3)
<
>

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఈ రోజు (17.05.2020) శ్రీ ఆంజనేయస్వామివారికి విశేషపూజలు నిర్వహించబడ్డాయి. శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాన ఆలయముతో పాటు పరివార దేవాలయాలలో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా ప్రస్తుతం లాక్ డౌన్ మరియు 144 సెక్షన్ అమలులో ఉన్నాయి. కావున భక్తులను ఈ పూజలకు అనుమతించలేదు.

కేవలం పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, సంబంధిత అధికారులు మాత్రమే ఈ పూజలలో పాల్గొన్నారు.

లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాలు సుఖ శాంతులతో ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు.

తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపించబడింది.
.
అనంతరం ఆంజనేయస్వామి వారికి ఆయా సూక్తలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం జరిపించబడ్డాయి. తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరపూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన జరిపించబడ్డాయి.