Kalavaibhavam.com (17.02.19): ఘనంగా భక్తరామగాస గోష్ఠిగాన ముగింపు వేడుకలు

ఘనంగా భక్తరామగాస గోష్ఠిగాన ముగింపు వేడుకలు

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, భద్రాచల రామగానసమితి, శ్రీ వాణీ మ్యూజిక్ అకాడమీల ఆధ్వర్యంలో తెలగు లలిత కళాతోరణంలో రామదాసు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన మూడురోజుల కార్యక్రమ ముగింపు వేడుక వేలమంది విదార్థులు, సంగీత కళాకారుల రామదాసు కీర్తనాగానం,రామదాసు శతక పద్యగానాలతో పులకించి పోయింది.

భద్రాచల దేవస్థానం రామదాసు ప్రాజెక్ట్ ను ప్రారంబిస్తే ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు డా. కె .వి .రమణాచారి అన్నారు .తెలంగాణ వాగ్గేయకారుడైన రామదాసు కీర్తనలను, పద్యాలను విద్యార్థులకు నేర్పి పద్యాల ప్రాముఖ్యకు వన్నె తెచ్చిన ఇలాంటి కార్యక్రమాల పరివ్యాప్తిలో సాంస్కృతిక శాఖ పాత్ర గొప్పదని ఆయన కొనియాడారు.

తెలంగాణ సాంస్కృతిక శాఖ కళలు, సాహిత్యాలకు పునర్వైభవం కల్పించే దిశగా సర్వోతోముఖాభివృద్ది సాధించిందని మామిడి హరికృష్ణ అన్నారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభూజీ అనుగ్రహ ప్రసంగంచేసి ఆశీర్వదించారు. పలురంగాల ఇతర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో అతిథులు సంగీతగురువులు,ఈ కార్యక్రమ రూపశిల్పి యరగొల్ల శ్రీనివాస యాదవ్ దంపతులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

రత్నకర శర్మ, కె.ఎల్. నరసింహారావు, భీమ్ సేన్ మూర్తి, గాందీలు సమన్వయం చేశారు.

* శ్రీనివాస్ యాదవ్ దంపతులను సత్కరిస్తున్న అతిథులు ‌

60338b04-b7d0-458a-92dd-64332d32fd5b b2767066-a80d-4b71-944a-751609a282da f891a9ad-1964-46f4-8237-5ad06aa8cc25
<
>