Kalavaibhavam.com(2-Apr): భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

◆ నిత్యకల్యాణ మండపంలో ఘనంగా సీతారాముల పరిణయం

◆ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు అల్లోల, పువ్వాడ.

 భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. ఏటా అంగరంగ వైభోగంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహించేవారు. కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో దేవస్థానం చరిత్రలో తొలిసారి ఈసారి రామయ్య కల్యాణాన్ని ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద నిర్వహించారు. కేవలం కొద్ది మంది సమక్షంలోనే క్రతువును నిర్వహించారు.

రామయ్య కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని దేవస్థానం అధికారులు కల్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు.

కరోనా వైరస్‌ ప్రబలుతున్న క్రమంలో భక్తులకు కల్యాణం ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత, పరిశుభ్రత మధ్య కల్యాణ మహోత్సవం ముగిసింది.

ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు.

ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే పొదెం వీరయ్య,  జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య , రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్‌ అనిల్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ సునీల్ దత్ IPS, దేవస్థానం ఈవో జి.నర్సింహులు ఇతర  అధికారులు ఉన్నారు.

1 thought on “Kalavaibhavam.com(2-Apr): భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *