Kalavaibhavam.com(9-Mar): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం, మరియు శ్రీరామనవమికి తలంబ్రాలు కలిపే విశేష కార్యక్రమం

భద్రాచలంలో ఘనంగా వసంతోత్సవం, మరియు శ్రీరామనవమికి తలంబ్రాలు కలిపే విశేష కార్యక్రమం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో సోమవారం నిర్వహించిన స్వామి డోలోత్సవం, వసంతోత్సవం, కళ్యాణ తలంబ్రాలు కలుపు తంతు ప్రక్రియ ఘనంగా నిర్వహించారు.

గుక్కా గులాలు, ఆత్తర్, పన్నీర్, ఆవు నెయ్యి, సెంట్, బియ్యం, పసుపు, కుంకుమలు, తొమ్మిది రకాల ద్రవ్యాలతో ఆవాహనం చేసి 1108మంది భక్తురాళ్లు తలంబ్రాలను కలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.