Kalavaibhavam.com(12.11.19): భక్తులను మంత్ర ముగ్దుల్నిచేసిన చింతలపూడి త్రినాధరావు భక్తి సంగీత విభావరి – కార్తీక పౌర్ణమి సందర్బంగా చిక్కడపల్లిలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి

భక్తులను మంత్ర ముగ్దుల్నిచేసిన చింతలపూడి త్రినాధరావు భక్తి సంగీత విభావరి

ఈ రోజు మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా చిక్కడపల్లిలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రముఖ గాయకుడు ఎస్.బి.ఐ మాజీ ఏజీఎం చింతలపూడి త్రినాధరావు భక్తి సంగీత విభావరి భక్తులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భక్తి సంగీత విభావరిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని త్రినాథ రావు పాడిన భక్తి పాటలను ఆసాంతం ఆస్వాదించారు. భక్తి పరమైన పాటలు అందరినీ అలరించాయి.

ప్రతి ఏట కార్తీక పౌర్ణమి రోజున భక్తి సంగీత విభావరి లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న ఆలయ నిర్వాహకులకు త్రినాథ రావు కృతజ్ఞతలు తేలిపారు. స్వామివారి సన్నిధిలో ఈ అవకాశం దక్కడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేసారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు త్రినాడహ రావుకు సత్కారం చేసి ప్రసాదమును అందచేశారు.

<
>