Kalavaibhavam.com(17-Dec): యాదాద్రిలో ఆలయ పునరుద్ధరణ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసిఆర్

By on Dec 17, 2019 in Yadadri and Temples

వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళవారం ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియతిరిగి ఆలయ పునరుద్ధరణ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసిఆర్ 

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఏలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు.

మొదట లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అనంతరం రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా వున్నాయని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్ లైన్ పెట్టుకుని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టీ ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యతా పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా వుండాలి. ప్రతీది నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం, ఇక్కడ పూజలు చేయటం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశవిదేశాల్లో లక్ష్మి నర్సింహస్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ భక్తులకు దైవ దర్శనం విషయంలో కానీ, వసతి సౌకర్యంలో కానీ, పుణ్య స్నానాల విషయంలో కానీ, తలనీలాల సమర్పణలో కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’ అని సిఎం అన్నారు.

జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. రాతి శిలలను అధ్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతా మూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని సిఎం అభినందించారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అధ్భుత ఆకారాలతొ కూడి ప్రాకారాలు సిద్ధమయ్యాయని సిఎం అన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయిందని సిఎం అన్నారు. ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సిఎం సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించే విధంగా తైల వర్ణ చిత్రాలను వేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ కొన్ని మార్పులను సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినప్పటికీ వారికి సౌకర్యవంతంగా వుండేట్లు ప్రెసిడెన్షియల్ సూట్ వుండాలని చెప్పారు. బస్వాపురం రిజర్వాయర్ ను పర్యటాక ప్రాంతంగా మారుస్తున్న విధంగానే ప్రెసిడెన్షియల్ సూట్ కు సమీపంలో వున్న మైలార్ గూడెం చెరువును సుందరీకరించాలని సిఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయ వుండే గుట్ట నుండి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు ఫైల్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిషోర్, వివేకానంద, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శంభీపూర్ రాజు, జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వైటిడిఎ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఇవో గీత, ఆలయ నిర్మాణ శిల్పి ఆనంద్ సాయి, ఆర్ అండ్ బి ఇఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు వున్నారు.

79154489_1168658826672301_921315672342921216_o 79383208_1168658030005714_1180161750566174720_o 79479272_1168659696672214_1289039051260690432_o 79545324_1168658336672350_1002726304992198656_o 79596415_2529685963979071_8153777149807951872_n 79711283_2529686227312378_2399926767503540224_n 79753336_1168658620005655_3723920367153053696_o 79859315_1168660446672139_5651201299585171456_o 79874276_2529686463979021_4000270296828346368_n 79893533_1168659686672215_9058606637429817344_o 79943571_1168658156672368_6266623929318637568_o 80101895_2529684723979195_922536787379748864_n 80212807_1168658220005695_5041861181061464064_o 80252259_2529685220645812_1258565815913938944_n 80287836_2529685697312431_8216608741777211392_n 80333085_1168659646672219_551929247728402432_o 80405142_1168660410005476_4769504458574921728_o 80435404_1168660256672158_6016100252174516224_o 80551299_1168660180005499_3171085761793490944_o 80604659_1168658713338979_2504200339998113792_o 80720619_1168658540005663_304549430810378240_o 81037991_2529685447312456_2871627215848603648_n
<
>