Kalavaibhavam.com(29-Mar): శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం

For the welfare of the World Pallaki Seva Utsavam performed Sri Bhramarambadevi in the Srisailam Temple today, 29.03.2020

Pallaki Seva has decorated with a variety of flowers.

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (29.03.2020)
రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించింది.

ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది.

అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించబడింది.

ఈ ఉత్సవములో శ్రీస్వామి అమ్మవార్లను వేంచేబు చేసే పనికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడింది.