Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు

భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు

భక్తి కూడా కడుపునింపుతుందని ఈ రోజు తెలిసిందని, సంకీర్తనలు వేడి వేడి కాఫీ తాగిన అనుభూతిని పంచాయని డా. వీరమళ్ళ సోమదేవరాజు కొనియాడారు. ప్రేక్షకులు ఎంత వచ్చారన్నదానికన్నా, వచ్చినవారు ఎంత ఆస్వాదనలో మునిగితేలారన్నదే ముఖ్యమని అయన పేర్కొన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో శ్రీ మ్యూజిక్ అకాడమి మరియు బి.ర్.ఎస్ మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం భక్తి సంగీత విభావరి జరిగింది. సంగీత కళారత్న యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన “హరినామ సంకీర్తన ” కార్యక్రమం నిర్వహించారు.

శ్రీనివాస్ యాదవ్ అయన శిష్య బృందం ఆలపించిన హరినామ సంకీర్తనలు ఆద్యంతం భక్తిభావంతో నిండిపోయాయి. ప్రేక్షకులను రంజింపచేసాయి. సభాస్థలి మొత్తం భక్తిసమొహమై పరవశించిపోయింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర బి.సి. కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు, విచ్చేసి భక్తి సంకీర్తనలను ఆస్వాదించారు.

వ్యక్తలు మాట్లాడుతూ… ఇంత చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసిన శ్రీనివాస్ యాదవ్ ను అభినందనీయమన్నారు. సంగీత విభావరి అంటే ఈ రోజుల్లో సినిమా పాటలు ముద్ర పడిపోయిందని, కానీ ఆధ్యాత్మిక భక్తి రస పాటలు పాడి, మన సంస్కృతి, సాంప్రదాయాలకు మళ్ళి జీవం పోయాల్సిన అవసరం వుందని, అది శ్రీనివాస్ యాదవ్ తో తీరుతోందని అన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించి, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇలాంటి కార్యక్రమాలు తిలకించేందుకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు కూడా సమాజంలో వున్న సంగీత ప్రియులు కూడా ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అతిధులుగా విచ్చేసిన తెలంగాణ రంగస్థల కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. వీరమళ్ళ సోమదేవరాజు, ప్రముఖ సంఘ సేవకురాలు డా. కొత్త కృష్ణవేణి, అఖిల భారత యాదవ మహాసభ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్, అముక్త కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేచినేని సురేందర్ రావు, పాత్రికేయులు, కళావైభవం.కామ్ వ్యవస్థాపకులు కె.ఎల్. నరసింహా రావులను శ్రీనివాస యాదవ్ శాలువాలతో ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపికలను అందచేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, భక్తి సంకీర్తన బృందం సబ్యులకు ప్రశంసా పత్రాలను అందచేశారు.

2 thoughts on “Kalavaibhavam.com (27.12.18): భక్తి కూడా కడుపునింపుతుంది – వీరమళ్ళ సోమదేవరాజు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *