Kalavaibhavam.com(15-May): నగరంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి: నగర మేయర్‌

నగరంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి: నగర మేయర్‌

ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో ప‌ర్య‌టించిన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, మూసి రివ‌ర్ ఫ్రంట్ ఛైర్మ‌న్‌/ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌

హైద‌రాబాద్‌, మే 15:  న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మ‌గ్రంగా అభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. శుక్ర‌వారం మూసి రివ‌ర్ ఫ్రంట్ ఛైర్మ‌న్‌, శాస‌న స‌భ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పుర‌పాలక శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్ తో క‌లిసి ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో మేయ‌ర్ ప‌ర్య‌టించారు. ఫ‌తుల్లాగూడ‌లో నిర్మిస్తున్న డి.ఆర్‌.ఎఫ్ శిక్ష‌ణ కేంద్రం ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

నాగోల్ ఆర్‌.టి.ఐ కార్యాల‌యం నుండి బండ్లగూడ వ‌ర‌కు, అల్కాపురి నుండి మ‌న్సూరాబాద్ వ‌ర‌కు ఉన్న రోడ్ల‌ను ప్ర‌ధాన రోడ్ల‌తో అనుసంధానం చేసే మిస్సింగ్ లింక్ రోడ్ల‌ను ప‌రిశీలించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.